Global Header Banner
Follow Wairal on Google News
Single Article Above Title

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

tavva sankar babu Jul 31, 2026 Entertainment
‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
నటీనటులు: సుమంత్‌, త్రినాథ్ వర్మ, రవివర్మ, షెల్లీ కుమార్, నేహా పఠాన్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ తదితరులు 
సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి 
ఛాయాగ్రహణం: వేదవ్యాస్ 
నిర్మాత: హరీష్ 
రచన-దర్శకత్వం: రాజేష్ కర్ణ

అప్పుడప్పుడూ ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు సీనియర్ హీరో సుమంత్. గత ఏడాది ‘అనగనగా’ అనే మంచి సినిమా చేశాడు. కానీ అది ఓటీటీకే పరిమితమైంది. ఇప్పుడు ‘న్యూటన్స్ థర్డ్ లా’ అనే థ్రిల్లర్ మూవీతో థియేటర్ ప్రేక్షకులను పలకరించాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకుందాం పదండి.

కథ: 
2026లో డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) అనే బిగ్ షాట్ కు ఎవరో న్యూటన్స్‌ థర్డ్‌ లా అనే ఒక పుస్తకాన్ని కొరియర్లో పంపిస్తారు. ఆ పుస్తకంలో 1999లో జరిగిన ఓ వాస్తవ కథ ఉంటుంది. కూతురితో కలిసి రాత్రి పూట రోడ్డు మీద నడుస్తుంటే ఓ కార్ వచ్చి ఢీకొట్టడంతో జ్యోతి (నేహా పఠాన్) చనిపోతుంది. మరోవైపు వర్తమానంలో కొన్ని రోజులకే వినయ్(త్రినాథ్ వర్మ) బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. వినయ్ కేసును విచారించడానికి పోలీసాఫీసర్ వాసుదేవ్(సుమంత్) వస్తాడు. పోస్టుమార్టం రిపోర్టులో వినయ్ ఆత్మహత్య చేసుకోలేదు.. తనది హత్య అని తేలుతుంది. వినయ్ చనిపోయేముందు ఏదో తప్పు చేసాడని.. అదేంటో కనిపెట్టాలని వాసుదేవ్ ప్రయత్నిస్తాడు. అలాగే వినయ్ తల్లితండ్రులు కూడా తన దగ్గర ఏదో దాస్తున్నారని కనిపెడతాడు. మరి జ్యోతి యాక్సిడెంట్ కేసుకి, వినయ్ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? ఈ మరణాల వెనుక ఎవరైనా ఉన్నారా? వినయ్ చనిపోయేముందు ఏం తప్పు చేసాడు? వినయ్ తల్లిదండ్రులు ఏం దాస్తున్నారు? న్యూటన్స్‌ థర్డ్‌ లా బుక్ ఎవరు రాశారు? అది డేవిడ్ కి ఎందుకు పంపారు? స్టీఫెన్ మెర్క్యురీ (జగపతిబాబు)కి ఈ వ్యవహారాలకు సంబంధం ఏంటి అనేది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 
ఓటీటీ విప్లవం తర్వత మన ప్రేక్షకులు మలయాళం థ్రిల్లర్లకు బాగా అలవాటు పడ్డారు. ఇక్కడ ఏదైనా థ్రిల్లర్ సినిమా తెరకెక్కినా మలయాళం సినిమాలతోనే పోల్చుతున్నారు. అందుకే మన ఫిలిం మేకర్స్ కూడా థ్రిల్లర్ సినిమాలు తీసేటపుడు ఆ చిత్రాలనే ఫాలో అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ రెండు- రెండున్నర గంటల నిడివితో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు తీస్తే.. గంటన్నర పాటు ఒకలా కథను నడిపించి.. కొన్ని చోట్ల బాగా సాగదీసి.. చివర్లో ఒక్కసారిగా ట్విస్టుల మీద ట్విస్టులిచ్చి కథను ఊహించని విధంగా ముగిస్తుంటారు. ప్రేక్షకులకు షాకిస్తుంటారు. ‘న్యూటన్స్ థర్డ్ లా’ కూడా అచ్చం ఇలాగే సాగే సినిమా. ఐతే చివరి 20 నిమిషాలు సర్ప్రైజులు.. షాకులతో బాగానే అనిపిస్తుంది కానీ... అప్పటి వరకు ఎదురు చూడడం మాత్రం సహనానికి పరీక్షే.
థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే అత్యంత కీలకమైన అంశం. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆసక్తికర కథనం తోడైతే ఆ జానర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఐతే ఈ స్క్రీన్ ప్లే కొంచెం తెలివిగా.. ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉండాలి. అంతే తప్ప.. అతి తెలివి చూపించేలా ఉంటే కష్టం. కథ కోసం ట్విస్టులే తప్ప.. ట్విస్టుల కోసం కథ అన్నట్లుగా ఉన్నా ఇబ్బందే. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ఇలాగే అనిపిస్తుంది. ‘న్యూటన్స్ థర్డ్ లా’ కథ ఔట్ లైన్ ఎంతో ఆసక్తికరంగా అనిపించేదే. కానీ ఆ కథను తెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానం అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. ఈ కథ ఆరంభంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి చివర్లో ఇచ్చిన సమాధానాలు బాగున్నాయి. డాట్స్ కనెక్ట్ చేసిన తీరు బాగుంది. ‘ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్స్ థర్డ్ లాను కథగా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. కానీ ఈ అంశాలు ఓకే అనిపించినా.. ఈ సినిమా ఎక్కువ సమయం అనాసక్తికరంగా సాగడం వల్ల ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది.

‘న్యూటన్స్ థర్డ్ లా’కు అతి పెద్ద మైనస్ ఇన్వెస్టిగేషన్ సీన్లు. ఏమంత క్యూరియాసిటీ కలిగించకుండా.. విపరీతమైన సాగతీతగా అనిపించే ఆ సీన్లు సినిమా ఫ్లోను దెబ్బ తీశాయి. ఈ కథను ఆరంభించిన తీరు బాగుంది. ముగింపూ ఆకట్టుకుంటుంది. కానీ మధ్యలో మాత్రం అసహనం తప్పదు.

డేవిడ్ అనే వ్యక్తికి పుస్తకం రావడంతో ఆ బుక్కేంటి.. అది అతడికి ఎవరు పంపారు? ఎందుకు పంపారు? అది చూసి డేవిడ్ ఎందుకు భయపడ్డాడు అనే ప్రశ్నలతో సినిమా మొదలవుతుంది. ఇక కథలోకి వెళ్ళగానే జ్యోతి యాక్సిడెంట్- వినయ్ సూసైడ్ వెంటవెంటనే చూపించి ఈ రెంటి మధ్య కనెక్షన్ ఏంటా అనే ఆసక్తి కలిగించారు. కానీ తర్వాత వాసుదేవ్ ఎంట్రీ నుంచి ఇన్వెస్టిగేషన్ సీన్లు మాత్రం సాగదీశారు.

ప్రథమార్ధంతో రేకెత్తిన ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే.. మధ్యలోకి మరో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా సాగతీతగానే అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ తో మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలను చివరి పావుగంటలో ఒకదాని తర్వాత ఒకటి హడావిడిగా రివీల్ చేస్తారు. కానీ కొంచెం కన్క్ఫ్యూజన్ తప్పదు. అది చాలదని ముగింపులో వాసుదేవ్ గురించి ఏదేదో చెప్పి కథని ఎటెటో తీసుకెళ్లడంతో ఇంకాస్త గందరగోళం తప్పదు. కథ అక్కడికి పూర్తయినా సంబంధం లేకుండా పార్ట్-2కి లీడ్ ఇచ్చారు. ఇది సింపుల్ గా ఓ ఫ్లాష్ బ్యాక్, ఇన్వెస్టిగేషన్ తో నడిపించే కథ. కాకపోతే దర్శకుడు ఎక్కువ తెలివిని ఉపయోగించి వర్తమానం-గతం మధ్య సన్నివేశాలను చూపిస్తూ కన్ఫ్యూజింగ్ గా స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. ప్రేక్షకుల బుర్రలకు పరీక్ష పెట్టాలని చూశారు కానీ.. ఆ వ్యవహారం కాస్తా అసహనం కలిగించేలా తయారైంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘న్యూటన్స్ థర్డ్ లా’ విషయం ఉన్న సినిమానే. కానీ ఆసక్తికర కథను పకడ్బందీగా చెప్పకపోవడంతో ఆశించిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.

నటీనటులు:
పరిమిత బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ లో నిర్మాణ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. సినిమా సాంకేతికంగా బాగుంది. వేదవ్యాస్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. జానర్ శైలికి తగ్గట్లు సినిమా అంతా కాస్త డార్క్ టోన్లో ఉంటుంది. సింజిత్ ఎర్రమిల్లి బీజీఎం థ్రిల్లర్ సినిమాల శైలికి తగ్గట్లుగా సాగింది. పాటలు మాత్రం బాగాలేవు. దర్శకుడు రాజేష్ కర్ణ ఎంచుకున్న ఐడియా బాగుంది. కొన్ని స్క్రీన్ ప్లే లాక్స్ బాగున్నాయి. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించదు. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నా.. ముగింపు బాగున్నా.. ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అంత ఆసక్తికరంగా లేదు.

సాంకేతిక వర్గం:
 పరిమిత బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ లో నిర్మాణ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. సినిమా సాంకేతికంగా బాగుంది. వేదవ్యాస్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. జానర్ శైలికి తగ్గట్లు సినిమా అంతా కాస్త డార్క్ టోన్లో ఉంటుంది. సింజిత్ ఎర్రమిల్లి బీజీఎం థ్రిల్లర్ సినిమాల శైలికి తగ్గట్లుగా సాగింది. పాటలు మాత్రం బాగాలేవు. దర్శకుడు రాజేష్ కర్ణ ఎంచుకున్న ఐడియా బాగుంది. కొన్ని స్క్రీన్ ప్లే లాక్స్ బాగున్నాయి. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించదు. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నా.. ముగింపు బాగున్నా.. ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అంత ఆసక్తికరంగా లేదు. చివరగా: న్యూటన్స్‌ థర్డ్‌ లా.. మెరుపులన్నీ ముగింపులోనే 

రేటింగ్ - 2.25/5
Share this story:
🎭 What is your reaction? Total Votes: 0

More from Entertainment

sssa

Jul 31, 2026

sadsada

Jul 31, 2026

Latest Stories Across Portal

sssa
Entertainment

sssa

sadsada
Entertainment

sadsada

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
Entertainment

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

Lenin Collections
Entertainment

Lenin Collections

‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!
Entertainment

‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు
Entertainment

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!
Entertainment

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!

సాలిడ్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ లోకి బ్లాస్ట్ నటుడు?
Entertainment

సాలిడ్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ లోకి బ్లాస్ట్ నటుడు?

sssa
Up Next in Entertainment sssa

Wairal Polls

View All →
Polls 📊 1 Votes
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంపై మీ అభిప్రాయం..?

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంపై మీ అభిప్రాయం..?

Blockbuster (బ్లాక్‌బస్టర్)
100%
Hit/Superhit (హిట్/సూపర్ హిట్)
0%
Polls 📊 0 Votes
జన నాయకుడు(జన నాయగన్)
జన నాయకుడు(జన నాయగన్)
చెన్నై లవ్ స్టోరీ
చెన్నై లవ్ స్టోరీ

జన నాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ - మీరు ఏ చిత్రాన్ని ముందు చూస్తారు..?

జన నాయకుడు(జన నాయగన్)
0%
చెన్నై లవ్ స్టోరీ
0%
Polls 📊 0 Votes
Poll: Which Christopher Nolan’s film is your all-time favorite?

Poll: Which Christopher Nolan’s film is your all-time favorite?

The Odyssey
0%
Oppenheimer
0%