'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
tavva sankar babu
•
Jul 26, 2026
•
Entertainment
జూలై నెల టాలీవుడ్ కు ఊహించని విజయాలను అందించింది. చిన్న సినిమాలు పెద్ద ఫలితాలు సాధిస్తే, కొత్త హీరోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది శ్రీనివాస మంగాపురం. జూలై 30న విడుదల కానున్న ఆ మూవీపై ఇప్పటికే సోషల్ మీడీయాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండటం, దర్శకుడు అజయ్ భూపతి ఆ ప్రాజెక్టును తెరకెక్కించడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం, లెనిన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ సాధించాయి. ఈ వారం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కథలు, కొత్త ఫేసెస్ కు ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో శ్రీనివాస మంగాపురం ప్రేక్షకుల ముందుకు రావడం విశేషంగా మారింది. ఆ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ దర్శకుడు అజయ్ భూపతి. RX 100 మూవీతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓ కొత్త హీరోతో లవ్ స్టోరీని తెరకెక్కించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్ భూపతి మార్క్ ఎమోషన్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
Share
this story:
🎭 What is your reaction?
Total Votes: 0
