‘రాకా’ కోసం దీపికా మైండ్ బ్లోయింగ్ డెడికేషన్..!
tavva sankar babu
•
Jul 18, 2026
•
Entertainment
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’. ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోనే, ఏడు నెలల గర్భంతో ఉన్నప్పటికీ కష్టతరమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటూ తన డెడికేషన్‌ను చాటుకుంటోంది.
ప్రెగ్నెన్సీ చివరి దశకు చేరుకునే లోపే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో, ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న అన్ని రకాల సెక్యురిటీల నడుమ ఆమె ఈ రిస్కీ స్టంట్స్ పూర్తి చేస్తోంది. ఈ చిత్రంలో దీపికా గర్భవతి అయినప్పటికీ, ఆమె స్క్రీన్ టైమ్‌ను ఎక్కడా తగ్గించడం లేదని సమాచారం.
జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ వండర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్యాన్-ఇండియా మూవీని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Share
this story:
🎭 What is your reaction?
Total Votes: 0
